Ajith Kumar : డిఫరెంట్ గా కనిపిస్తోన్న అజిత్ టీజర్
కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన అజిత్ కుమార్ కొత్త సినిమా విడాముయర్చి. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్రిష హీరోయిన్. అర్జున్, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే అర్థమయ్యీ కానట్టుగా కనిపిస్తోంది. బట్ టేకింగ్ పరంగా, మేకింగ్ పరంగా ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటి వరకూ హోరెత్తే ఆర్ఆర్ తో అదరగొట్టిన అనిరుధ్ ఈ టీజర్ కు డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఎక్కడా హై టెంపో కానీ ఆ టోన్ కానీ కనిపించడం లేదు.
విడాముయర్చి టీజర్ చూస్తే.. ఎక్కువగా పాత్రలను పరిచయం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. హీరో పరంగా ఎప్పుడైతే.. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కటి నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతుందో.. అప్పుడు నిన్ను నువ్వు బలంగా నమ్ముకో అనే చివరి లైన్స్ మాత్రం కథకు సంబంధించిన హింట్ ఇస్తున్నాయి. నమ్మిన మనుషులు కావొచ్చు.. ప్రేమించిన అమ్మాయి కావొచ్చు.. మనల్ని విడిచిపెట్టి వెళ్లినప్పుడు మరింత ధైర్యంగా ఉండాలనే పాయింట్ ఉన్నా.. వాళ్లెందుకు విడిచి వెళ్లారు.. ఆ క్రమంలో వాళ్లు చేసిన గాయాలేంటీ అనేది అసలు కథకు మూలం అవుతుందేమో.
టీజర్ లో ప్రతి షాట్ కూ ఓ ఇంపార్టెన్స్ ఉందనేలా ఉంది. ఆ షాట్స్ వచ్చిన సీక్వెన్స్ అన్నీ హైలెట్ అవుతాయనే హింట్ ఉంది. అజిత్ ఎప్పటిలాగానే వైట్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. త్రిష పాత్ర ఏంటో చెప్పలేదు. తన క్లోజప్ షాట్స్ కూడా లేవు. విశేషం ఏంటంటే.. ఇంతకు ముందు మాంగత్తా అనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజిత్. అప్పుడు అజిత్, త్రిషతో పాటు అర్జున్ కీలక పాత్రల్లో ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ ముగ్గురూ కలిసి నటించిన సినిమా ఇది. ఈ మేరకు కూడా అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోనే విడుదల చేస్తున్నట్టు టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు మేకర్స్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com