Ajith : సంక్రాంతి బరిలోనే అజిత్ మూవీ

Ajith :  సంక్రాంతి బరిలోనే అజిత్ మూవీ
X

తమిళ్ టాప్ స్టార్ తలా అజిత్ సినిమా అంటే అక్కడ ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అతని కెరీర్ ఆరంభంలో తెలుగులోనూ మంచి మార్కెట్టే ఉంది. బట్ ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. ఓవైపు తమిళ్ స్టార్స్ అంతా తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేస్తోన్న టైమ్ లో కొన్నాళ్లుగా తన సినిమాలు వరుసగా ఇక్కడ డబ్ అవుతున్నాయి. కాకపోతే ఇవేం అజిత్ కు పట్టవు. అతను సినిమాలు చేయడం వరకే. నో ప్రమోషన్స్, నో ఇంటర్వ్యూస్ అనే బాపతు. అందుకే అతనికి కొత్త మార్కెట్ వచ్చినా రాకపోయినా పెద్దగా పట్టించుకోడు. అయినా అతని సినిమాలు తెలుగులో డబ్ అవడం ఆగలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విడాముయర్చి అనే మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు.

కొన్ని రోజులుగా ఈ చిత్రం సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రియాక్ట్ అయింది. తమ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో తెలుగులోనూ అదే టైమ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే అజిత్ మూవీస్ తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు టైటిల్స్ ను అలాగే వదిలేస్తున్నారు. తెలుగు టైటిల్స్ పెట్టడం లేదు. ఈ విడాముయర్చికి తెలుగులో పట్టుదల అని అర్థం. మరి ఈ సారైనా తెలుగు టైటిల్ పెడతారా లేదా అనేది తెలియదు కానీ.. ఇంకా ఈ మూవీని తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేశాడు.

ఇక ఈ మూవీ ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారు అనే వార్తలు వచ్చాయి. మొదట కాదు అని బుకాయించినా తర్వాత ఒప్పుకున్నారు మేకర్స్. అంతే కాదు.. ఈ విమర్శలు పెరుగుతాయని భావించి మూడు నెలల క్రితమే బ్రేక్ డౌన్ రీమేక్ రైట్స్ తీసుకున్నారట. మొత్తంగా సంక్రాంతికి తమిళ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదలయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Tags

Next Story