Akash Jagannadh : పవర్ ఫుల్ టైటిల్ తో ఆకాశ్ జగన్నాథ్

బాల నటుడుగా తన తండ్రి డైరెక్ట్ చేసిన అనేక సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు ఆకాశ్ జగన్నాథ్( ఈ మధ్యే ఆకాశ్ పూరీ అనే పేరులో పూరీ ప్లేస్ లో జగన్నాథ్ అని చేర్చుకున్నాడు ). తర్వాత అందరు బాల నటుల్లాగే తనూ హీరో అయ్యాడు. ఆంధ్రా పోరి అనే మూవీతో హీరో అయిన ఆకాశ్ తర్వాత తండ్రే డైరెక్ట్ చేసిన మెహబూబాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అది పోయింది. రొమాంటిక్ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. చివరగ వచ్చిన చోర్ బజార్ మెప్పించలేదు. అటు తండ్రి పూరీ జగన్నాథ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు.
చోర్ బజార్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో తన పేరు పక్కన తండ్రి పేరు చేర్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆకాశ్ కొత్త సినిమా అనౌన్స్ అయింది. ఈ మూవీకి ‘తల్వార్’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ చూస్తే పవర్ ఫుల్ గా ఉంది. ఆకాశ్ ఇమేజ్ కు కాస్త ఎక్కువ అనే చెప్పాలి. అయినా టైటిల్స్ ను కంటెంట్ ను బలంగా సపోర్ట్ చేస్తే హీరోల కటౌట్ తో పనిలేకుండా హిట్ కొట్టేయొచ్చు.
ఇక ఈ తల్వార్ ను కాశీ పరశురామ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆతర కాస్టింగ్ డీటెయిల్స్ ను అనౌన్స్ చేస్తారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com