Akhanda 2 Collections : మొదటి రోజు అదరగొట్టిన అఖండ 2

Akhanda 2 Collections :  మొదటి రోజు అదరగొట్టిన అఖండ 2
X

అఖండ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది అనిపించేసింది. మొదటి రోజు ప్రీమియర్స్ ను బట్టి 59.5 కోట్లు కొల్లగొట్టింది. అంటే మొదటి రోజు వసూళ్లు అని చెప్పొచ్చు. ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలవబోతోంది అనిపించేలా ఉంది. ఓవర్శీస్ తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా టాక్ కూడా బావుంది. సనాతన ధర్మాన్ని హైలెట్ చేస్తూ సాగే కథనంతో ఆకట్టుకుంది మూవీ. బాలయ్య నటనతో అద్భుతం అనిపించుకున్నాడు. అసలు ఈ రేంజ్ లో యాక్టింగ్ అంటే బాలయ్య తర్వాతే అనిపించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు.

బాలయ్య డ్యూయొల్ రోల్ తో కనిపించినా.. కాస్త ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది అనే టాక్ తెచ్చుకుందీ మూవీ. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాండ్ తో మాత్రం అరుపులే అనిపించాడు. హీరోయిన్ లేకున్నా కూడా పాట కోసం సంయుక్తను వాడుకున్నట్టు కనిపించినా తర్వాత తన యాక్టింగ్ తో మాత్రం అదరగొట్టింది. గెస్ట్ రోల్ లాగానే అనిపించినా.. ఆ కాసేపు మాత్రం అద్భుతంగా నటించింది. జనని పాత్రలో హర్షాలీ అదరగొట్టింది. మొత్తంగా ఈ వసూళ్లతో పాటు వీకెండ్ వరకు మూవీ భారీగా వసూళ్లు సాధించబోతోందనేది మాత్రం అర్థం అవుతోంది.

Tags

Next Story