Psych Siddharth : సైక్ సిద్ధార్థ్ పై అఖండ 2 ఎఫెక్ట్

Psych Siddharth :  సైక్ సిద్ధార్థ్ పై అఖండ 2 ఎఫెక్ట్
X

కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ ల గురించి చిన్న, మీడియం మూవీస్ ప్రభావం కనిపిస్తుంది. బట్ ఆ పెద్ద సినిమా ఆగిపోవడం మాత్రం చాలా పెద్ద సమస్య అవుతుందనేది కొత్తగా తెలుస్తోంది. అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. ఆ వెంటనే మూవీ సైక్ సిద్ధార్థ్ మూవీపై ప్రభావం పడిపోయింది. అది కావాలనే జరగలేదు. కానీ అలాగే కనిపిస్తోంది.

సైక్ సిద్ధార్థ్ మూవీలో శ్రీ నందు హీరోగా నటిస్తున్నాడు. యామినీ భాస్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ వచ్చే వారం అంటే 12న విడుదల కాబోతోంది. ఈ మూవీ షెడ్యూల్ ప్రకారంగా 5న మూవీ సాంగ్ విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. చేశారు కూడా. బట్ మీడియాలో ఈ మూవీ సాంగ్ కు ఏమాత్రం కవరేజ్ జరగలేదు. అసలు ఈ మూవీ పాట కూడా విడుదలైనట్టుగా కూడా కనిపించలేదు. పాట బావుంది. మెలోడీయస్ గా ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగులో మళయాల సింగర్ అయిన జెస్సీ గిఫ్ట్ గా పాడాడు కూడా. అయినా ఈ మూవీ పాట గురించి పట్టించుకోవడం లేదు మీడియా వాళ్లు మాత్రం.

అఖండ 2 పోస్ట్ పోన్ కావడంతో అంతా ఆ హడావిడీయే కనిపించింది. ముఖ్యంగా సైక్ సిద్ధార్థ్ మూవీ నిర్మాతల్లో ఒకడైన సురేష్ బాబు మాటలు మాత్రమే హైలెట్ అయింది. అఖండ 2 పోస్ట్ పోన్ గురించి సురేష్ బాబు మాట్లాడింది చాలా చిన్న అంశమే. కానీ మొత్తం హైలెట్ గా అయింది. అందరూ అతను మాట్లాడిన ఆ చిన్న అంశం గురించే మాట్లాడుకున్నారు. అంతే తప్ప సైక్ సిద్ధార్థ్ మూవీ సాంగ్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఒక్కోసారి ఇలాగే అవుతుందేమో.

Tags

Next Story