Akhanda 2 : అఖండ 2 కు ఊరట దక్కింది

Akhanda 2 :  అఖండ 2 కు ఊరట దక్కింది
X

అఖండ 2 కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయితే ఆ టాక్ ను కంటిన్యూ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. అందుకు కారణం టికెట్ ధరలు పెంచడమే. టికెట్ ధరల వల్ల ఎక్కువమంది సినిమా చూడలేకపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు తగ్గించారు. అక్కడ ఆడియన్స్ కు ప్లస్ పాయింట్ అయింది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ ధరలు తగ్గించారు. దీంతో అక్కడి ఆడియన్స్ కు మాత్రం చాలా ప్లస్ అయింది అనేది నిజం.

బాలకృష్ణ నట విశ్వరూపం చూపించిన అఖండ 2 రెండు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. అయితే బోయపాటి టేకింగ్ పరంగా మాత్రం కాస్త ఓవర్ అయింది అనే టాక్ వస్తోంది. యాక్షన్ సీన్స్ లో బాలయ్యను మరీ దారుణంగా చూపించాడు అంటున్నారు. ఇలాంటి అంశాల్లో బాలయ్య దర్శకుడు ఏం చెప్పినా ఓకే అంటుంటాడు. అదే కాస్త తేడా కొట్టేలా ఉంది అనిపించారు. బట్ ఇప్పటికే 100 కోట్ల వరకు వచ్చేసింది మూవీ. టికెట్ ధరలు తగ్గించి ఉంటే ఇప్పటికే ఆ మార్క్ కు చేరి ఉండేది. మొత్తంగా నేటి నుంచి టికెట్ ధరలు తగ్గించడంపై ఆడియన్స్ కు మరింత ప్లస్ అవుతుంది.

Tags

Next Story