Akhanda 2 : అఖండ 2 బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా..?

Akhanda 2 :  అఖండ 2 బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా..?
X

నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ జోష్ లో కనిపిస్తున్నాడు. తన కెరీర్లో ఈ మధ్య అన్నీ విజయాలే వస్తున్నాయి. ఓ రకంగా అన్నీ సూపర్ హిట్స్ పడుతున్నాయి. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనిపించేలా ఉన్నాడు అఖండ 2 తో. ఈ మూవీకి అన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. బోయపాటి శ్రీనుతో బాలయ్య కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కావడం.. ఓ కారణం అయితే.. అఖండ కు సీక్వెల్ గా రూపొందడం ఓ కారణం. అఖండకు సీక్వెల్ అనగానే ఆడియన్స్ ఏ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేస్తారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ స్థాయిలోనే ఈ మూవీ ఉంది. రేపు ప్రీమియర్స్ వేయడం మొదలు పెట్టబోతున్నారు. ప్రీమియర్స్ కు 600 రూపాయల టికెట్ ధరకు చెప్పారు. తర్వాత రోజు నుంచి మాత్రం మల్టీ ప్లెక్స్ లో 100, సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. ఇది ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పాలి.

ఇక మూవీ ప్రమోషన్స్ పరంగా కూడా ఓ రేంజ్ లో కనిపిస్తోందీ మూవీ. బాలయ్య డ్యూయొల్ రోల్ తో కనిపించినట్టుగా ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రమోట్ చేస్తున్నాడు. అతని నిర్మాతలు, హీరోయిన్ కూడా ప్రమోషన్స్ విషయంలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. బోయపాటి మాత్రం ఇంకా టైమ్ తీసుకోలేదు. అంటే మూవీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి అందుకు టైమ్ సరిపోలేదు. మొత్తంగా బాలయ్య నుంచి ఓ బ్లాక్ బస్టర్ మాత్రం గ్యారెంటీగా పడబోతోందనేది అఖండ 2 తో తేలిపోయినట్టే కనిపిస్తోంది.

Tags

Next Story