Akhanda 2 : క్లైమాక్స్ కు వెళుతున్న అఖండ 2

Akhanda 2 :  క్లైమాక్స్ కు వెళుతున్న అఖండ 2
X

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మూవీ అఖండ 2. 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారు అనుకోవచ్చు. ఇక అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అద్భుతమైన విజయం సాధించింది. డ్యూయొల్ రోల్ లో బాలయ్య రోరింగ్ పర్ఫార్మెన్స్ కు థమన్ నేపథ్య సంగీత తోడై థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బోయపాటి డైరెక్షన్ పీక్స్ లో కనిపిస్తుందీ మూవీలో. ఫస్ట్ టైమ్ బాలయ్య అఘోరీగా నటించడం చాలామందిని ఆశ్చర్యపరిచినా.. ఆ పాత్రను డిజైన్ చేసిన విధానానికి ఫిదా అయిపోయారు. అందుకే ఈ మూవీకి సీక్వెల్ అనగానే అందరిలోనూ ఓ ఆసక్తి మొదలైంది.

చాలా రోజుల క్రితమే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న అఖండ 2 ఏ మాత్రం గ్యాప్ లేకుండా సాగుతోంది. బాలయ్యతో పాటు ఈ సారి ప్రగ్యాజైశ్వాల్, సంయుక్త ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. థమన్ మరోసారి సౌండ్ బాక్స్ లు బద్ధలు కొట్టబోతున్నాడు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న అఖండ2 క్లైమాక్స్ కోసం జార్జియా వెళుతున్నారు.

ఆల్రెడీ మేజర్ టీమ్ అంతా జార్జీయా వెళ్లిపోయింది. ఈ 21 నుంచి ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తారట. ఇక వచ్చే నెల బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్ కూడా విడుదల చేస్తారు అని చెబుతున్నారు. ఇక సినిమాను ఈ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు.

Tags

Next Story