Harshali Malhotra : బాలయ్య మూవీలో భజరంగీ బ్యూటీ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ అఖండకు సీక్వెల్. అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన అఖండ 2 టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ యేడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోన్న అఖండ 2 లో సంయుక్త ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. తనతో పాటు ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉంటుంది. మరోసారి బాలయ్య డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి భజరంగీ బాయీజాన్ లో నటించిన బాలనటిని తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు తను టీనేజ్ లో కనిపిస్తోంది. చాలా అందంగా కూడా తయారైంది. తన పేరు హర్షాలీ మల్హోత్రా. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి తనను తీసుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
ఫస్ట్ పార్ట్ లో నటించిన బేబీ దేశ్న జవాజీ పాత్రలోనే హర్షాలీ నటించబోతోంది. సినిమాలో పాప పేరు జనని. ఆ జనని కాస్త పెరిగి పెద్దయిన తర్వాత హర్షాలీగా కనిపించబోతోందన్నమాట. హర్షాలీని కూడా టీమ్ జనని గానే పరిచయం చేసింది. ఇది తనకు ఫస్ట్ తెలుగు సినిమా. కాకపోతే బాలయ్య కూతురుగా నటించబోతోందన్నమాట. మరి ఈ మూవీ తర్వాత బాయీజాన్ పాప కాస్తా అఖండ 2 జననిగా పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com