Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకాకు ప్లస్ అవుతుందా..?

ఒక సినిమాకు మైనస్ అయితే.. మరో సినిమాకు ప్లస్ అవుతుందా అంటే అవును అనే అంటున్నారు. అఖండ 2 సినిమా వాయిదా పడింది. దీంతో ఆ గ్యాప్ ను ఆంధ్రాకింగ్ తాలూకా భర్తీ చేయడం సులువు అవుతుంది అంటున్నారు. ఆంధ్రాకింగ్ తాలూకా సినిమాకు టాక్ వచ్చినంత గొప్పగా కలెక్షన్స్ రాలేదు అని మేకర్స్ స్వయంగా చెబుతున్నారు. రామ్ పోతినేని కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ అంటున్నారు. అవన్నీ వసూళ్ల వరకు రాలేదు. అయితే ఇప్పుడు అఖండ 2 కు వచ్చిన గ్యాప్ కారణంగా ఆంధ్రాకింగ్ తాలూకా మాత్రం ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
అఖండ 2 రిలీజ్ టైమ్ లో అసలు వేరే మూవీస్ అంటూ రాలేదు. కొత్తగా వచ్చే సినిమాలు లేకపోవడం అనేది ఆంధ్రాకింగ్ తాలూకా చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. ఈ మూవీకి మరోసారి అవకాశం వచ్చింది అంటున్నారు. పైగా ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ పాజిటివ్ టాక్ వసూళ్ల పరంగా ఈ అవకాశాన్ని తీసుకు రాబోతోందంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మరి అఖండ 2 రావడం లేదు కాబట్టి ఆ అవకాశాన్ని గట్టిగా వాడేసుకునే ఛాన్స్ ను అందుకునే అవకాశం మాత్రం ఆంధ్రాకింగ్ తాలూకా మాత్రం అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

