Nandamuri Balakrishna: అఖండ గురించి ఆ దేశంలో కూడా మాట్లాడుకుంటున్నారు.. ఆనందంలో బాలయ్య
Nandamuri Balakrishna: బోయపాటి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.. బాలకృష్ణకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.. విడుదలైన అన్నిచోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది.. కమర్షియల్‌గానూ సక్సెస్ సాధించిన అఖండ విజయంతో మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు బాలయ్య.
అహాలో వస్తున్న అన్‌స్టాబుల్‌లో సినీ హీరోలతో చిట్ చాట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అఖండ చిత్ర బృందం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అఖండ సినిమా గురించి పాకిస్థాన్‌లో కూడా మాట్లాడుకుంటున్నారట.. వాట్సప్‌లో పోస్ట్ చేశారు అని అన్నారు.
ఈ విజయం నా ఒక్కడిదే కాదు, దర్శకుడితో పాటు చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిదీ అని ఆయన అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు సినిమాకు సహాయ సహకారాలు అందించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com