సినిమా

Akhanda Movie: 'అఖండ' సినిమాకు సీక్వెల్ రెడీ.. విడుదల అప్పుడే..

Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని మరోసారి నిరూపించుకున్నారు.

Akhanda (tv5news.in)
X

Akhanda (tv5news.in)

Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్స్ అవ్వగా.. ఇటీవల విడుదలయిన అఖండ కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా అఖండ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానుందన్న రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన అఖండ మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో బాలయ్యను డైరెక్ట్ చేయాలంటే.. అది బోయపాటికే సాధ్యమని మరోసారి ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అందుకే మళ్లీ మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. అయితే వీరిని హ్యాపీ చేసేలా అఖండ సీక్వెల్ గురించి అప్పుడే రూమర్స్ మొదలయిపోయాయి.

అఖండకు సీక్వెల్ కథను ముందే సిద్ధం చేశారట దర్శకుడు బోయపాటి. అఖండ సినిమా ముగిసిన తీరు చూస్తుంటే చాలామంది ప్రేక్షకులు సీక్వెల్ ఉంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. అయితే త్వరలోనే ఈ సీక్వెల్ కూడా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. 2023లో అఖండ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Next Story

RELATED STORIES