Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేవాగుణం చాటుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ..

Akhanda Movie: మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి, రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని హీరో బాలకృష్ణకి అందజేసారు. టాలీమూవీస్ మోహన్ కమ్మ రెండు లక్షలు రూపాయలు, కెనడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర లక్ష రూపాయలు.. మొత్తం ఎనిమిది లక్షల రూపాయలను బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి డొనేషన్ గా అందించారు.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ కార్యక్రమం అందరి మన్ననలు పొందింది. ఓవర్సీస్ లో 500 థియేటర్స్ లో విడుదలవుతున్న అఖండ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బిగ్గెస్ట్ గా రిలీజ్ అవుతున్న అఖండ మూవీ తెలుగు సినిమా కి పూర్వ వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అఖండ చిత్రం.. బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధిస్తుందని విశ్లేషకులంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com