Akhanda Movie: బాలయ్య క్యారెక్టరైజేషన్‌కు సెట్ అయ్యే అఖండ లిరికల్ సాంగ్..

Akhanda Movie (tv5news.in)
Akhanda Movie: బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ అంటే ఎంత ఊర మాస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన సినిమాలలాగా కాకుండా 'అఖండ' కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఇందులో బాలయ్య తన కెరీర్‌లో ముందెన్నడూ లేని అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా అఖండ నుండి అందరూ ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.
రోర్ ఆఫ్ అఖండ పేరుతో సినిమా నుండి విడుదలయిన గ్లింప్స్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో పాటు బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ మధ్య వచ్చే డ్యూయెట్ కూడా మెలోడీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల గురించి అప్డేట్ ఇస్తూ ఓ ప్రోమోను విడుదల చేసింది అఖండ టీమ్. ఇక ఈరోజు ఏకంగా లిరికల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
అఖండ టైటిల్ సాంగ్‌లో తమన్ ఎప్పటిలాగానే తన మాస్ బీట్స్‌తో ఇరగ్గొట్టాడు. మొత్తం పాటలో నిప్పు కణికలు, అగ్ని జ్వాలలు ఉండేలా చూసుకున్నాడు బోయపాటి. విజువల టేకింగ్ అద్భుతంగా ఉంది. ఇవన్నీ బాలయ్య క్యారెక్టరైజేషన్‌ను సూచిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అఖండ లిరికల్ సాంగే ఇలా ఉంటే.. ఇంక సినిమాలో దీని వీడియో సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలను పెంచేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com