Akhanda Release Date: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ విడుదల అప్పుడే..

Akhanda Release Date: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ విడుదల అప్పుడే..
X
Akhanda Release Date: ఫ్లాపులతో సతమవుతున్న బాలయ్యకు ‘సింహా’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించారు బోయపాటి.

Akhanda Release Date: బాలయ్య ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. బోయపాటి కాంబినేషన్‌తో వచ్చిన క్రేజ్ మరే కాంబినేషన్‌తో రాలేదు. ఫ్లాపులతో సతమవుతున్న బాలయ్యకు 'సింహా'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించారు బోయపాటి. నందమూరి నటసింహాన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపించారు. అప్పుడే వీరి కాంబినేషన్‌కు ఫ్యాన్స్ అయిపోయారు.

బాలక‌ష్ణ ఎక్కువగా మాస్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలాంటి ఒక సినిమానే 'సింహా'. దాని తర్వాత మళ్లీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు 'లెజెండ్' రూపంలో మరో హిట్‌ను అందించారు. అంతే ఈ కాంబినేషన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది.

ఇక బాలకృష్ణ, బోయపాటి కలిసి హ్యా్ట్రిక్ సినిమా చేయనున్నారని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒక రోర్ అఫ్ అఖండ పేరుతో విడుదలయిన 'అఖండ' టైటిల్, గ్లింప్స్‌ను చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలయ్య ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయోగం ఏదో అఖండతో చేస్తున్నాడని ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే అఖండ నుండి గ్లింప్స్‌తో పాటు రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. అందులోనూ ముఖ్యంగా అఖండ టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. అఖండ విడుదల తేదీ గురించి ఎప్పుడూ, ఎక్కడా ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుందని వార్తలు వినిపిస్తాయి. ఇక తన అభిమాన హీరోను అఘోరగా తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్..

Tags

Next Story