Home
 / 
సినిమా / Unstoppable With NBK:...

Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్' షోలో బాలయ్య కంటతడి..

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఈ షో రికార్డులతో దూసుకుపోతోంది.

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కంటతడి..
X

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఈ షో రికార్డులతో దూసుకుపోతోంది. 'ఆహా'లో ఇప్పటివరకు మొదలయిన టాక్ ‌షోలలో అన్‌స్టాపబుల్ సాధించినంత విజయం మరే టాక్ షో సాధించలేదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరు హీరోలను కవర్ చేస్తోంది అన్‌స్టాపబుల్ షో. తాజాగా బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ టీమ్ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసింది.

'అఖండ' సినిమాకు నందమూరి అభిమానుల నుండే కాదు ప్రేక్షకుల దగ్గర నుండి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికీ చాలాచోట్ల అఖండ షోస్‌కు హౌస్‌ఫుల్ నడుస్తోంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా అఖండకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే తన షోలోనే సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు బాలయ్య. అందుకే మూవీ టీమ్‌ను అన్‌స్టాపబుల్ వేదికపైకి పిలిపించారు.

అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను, విలన్ శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. అన్‌స్టాపబుల్ వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఇటీవల విడుదల చేసింది. ఇందులో బాలయ్య, శ్రీకాంత్ పోటాపోటీగా డైలాగులు చెప్పుకున్నారు. బాలయ్య కూడా తనకు ఎప్పుడైనా అవకాశం వస్తే విలన్‌గా నటిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అఖండ్ టీమ్ అంతా అన్‌స్టాపబుల్ వేదికపై సరదాగా ఆటలు ఆడారు, డ్యాన్సులు చేశారు. సరదాగా సాగిపోతున్న షోలో బాలయ్య తన తండ్రి ఎన్‌టీఆర్‌ను తలచుకొని కంటతడి పెట్టుకున్నారు. అందరు ఆయనను వెన్నుపోటు పొడిచారని మాట్లాడరని అప్పటి చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తాను ఎప్పటికీ ఎన్‌టీఆర్ కొడుకుల్లో ఒకరిని మాత్రమే కాదు అభిమానుల్లో కూడా ఒకరిని అన్నారు బాలకృష్ణ. అఖండ స్పెషల్ అన్‌స్టాపబుల్ షో ఈ నెల 10న ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Next Story