Akhil Akkineni : రిలీజ్ అయిన రెండేళ్లకు ఓటిటికి వస్తోన్న ఏజెంట్

అఖిల్ అక్కినేని చాలా ఇష్టపడి, కష్టంతో చేసిన సినిమా ‘ఏజెంట్’. 2023 ఏప్రిల్ 28న విడుదలైందీ సినిమా. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అఖిల్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. మమ్మూట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. బట్ సినిమా పోయింది. ఎంతలా అంటే నిర్మాతే ఏకంగా అసలు స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సినిమా చేశాం అని చెప్పుకునేంత. అంటే ఆ రేంజ్ డిజాస్టర్ అన్నమాట. కాకపోతే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. మమ్మూట్టి క్యారెక్టరైజేషన్ బావుంటుంది. వక్కంతం వంశీ కథ, సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే అల్లుకున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. స్టైలిష్ గా కనిపిస్తుంది. బట్ కథ, కథనాల్లో చాలా లోపాలు కూడా కనిపిస్తాయి. అలాగే విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా కనిపిస్తాయి.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీతో నిర్మాతలు కూడా అదే స్థాయిలో లాస్ అయ్యారు. అయితే కొందరు అక్కినేని ఫ్యాన్స్ కు ఈ మూవీ బాగా నచ్చింది. అందుకే ఓటిటిలో మళ్లీ చూడాలనుకున్నారు. బట్ ఈ మూవీ ఇప్పటి వరకూ ఓటిటికి రాలేకపోతోంది. 2023 సెప్టెంబర్ లోనే సోనిలివ్ లో వస్తుందని ప్రచారం జరిగింది. బట్ రాలేదు. ఆ తర్వాత ఈ మూవీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్ గా ఇప్పుడు అదే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ నెల 14 నుంచి స్ట్రీమ్ అవుతుందని కొత్త అప్డేట్ ఇచ్చారు. బట్ ఈ సారి కూడా వస్తుందనే నమ్మకం మాకు లేదు దొరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. మూవీ రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. మరి ఇప్పటికైనా ఓటిటికి వస్తుందా లేదా అనేది 14న తేలుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com