Akhil Akkineni: త్వరలోనే పాన్ ఇండియా సినిమాలో అక్కినేని చిన్నోడు..

Akhil Akkineni (tv5news.in)
Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ హీరోలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అప్పుడు నాగేశ్వర రావు నుండి ఇప్పుడు నాగచైతన్య వరకు అందరూ ప్రేమకథలతో ఆకట్టుకున్నవారే. ఈ హీరోలు మధ్యమధ్యలో కమర్షియల్, యాక్షన్ సినిమాలు చేసినా కూడా.. ఎక్కువగా పేరు వచ్చింది మాత్రం ప్రేమకథలతోనే. అలాగే అక్కినేని చిన్నోడు అఖిల్ కూడా ఇప్పటివరకు ప్రేమకథలతోనే హిట్ అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు తన చూపు పాన్ ఇండియా సినిమాపై పడినట్టు సమాచారం.
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన చివరి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' క్లీన్ హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం తాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం అఖిల్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపించడంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఇప్పటికే ఏజెంట్ మూవీ నుండి విడుదలయిన ఫస్ట్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే త్వరలోనే అఖిల్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడన్న వార్త ఇటీవల వైరల్‌గా మారింది. అయితే దీనికోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రంగంలోకి దిగనున్నాడు. అయితే బాలీవుడ్ దర్శకుడు, బాలీవుడ్ నిర్మాతతో తెరకెక్కే ప్రాజెక్ట్ అయినా కూడా దీనిని పాన్ ఇండియాలో లెవెల్‌లో తెరకెక్కించాలని మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com