సినిమా

Akhil Akkineni: అఖిల్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు నిరాశ.. టీజర్ కావాలంటే అప్పటివరకు ఆగాల్సిందే..

Akhil Akkineni: అఖిల్ 'ఏజెంట్' సినిమా షూటింగ్‌ను ప్రారంభించి చాలాకాలమే అయ్యింది.

Akhil Akkineni: అఖిల్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు నిరాశ.. టీజర్ కావాలంటే అప్పటివరకు ఆగాల్సిందే..
X

Akhil Akkineni: అక్కినేని హీరోలంటే యూత్‌లో చాలా క్రేజ్ ఉంటుంది. ప్రేమకథలు చేయాలంటే వారే కరెక్ట్ అనే ఆలోచన ఉంటుంది. అక్కినేని నాగేశ్వర రావు దగ్గర నుండి అఖిల్ వరకు అందరూ ప్రేమకథలతో హిట్లు కొట్టినవారే. వీరు కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా లవ్ స్టోరీలే వీరికి బాగా కలిసొస్తాయి. అలాంటి అక్కినేని హీరోల్లో ఒకరైన అఖిల్.. ఈ శుక్రవారం తన 28వ ఏట అడుగుపెడుతున్నాడు. కానీ ఈరోజు తన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టే అప్డేట్‌లు మాత్రం లేవు.

'హలో' సినిమాతో హీరోగా పరిచయమయిన అక్కినేని అఖిల్‌కు సరైన హిట్ పడడానికి చాలా సమయమే పట్టింది. ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకుల దగ్గర నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక అలాంటి ఓ ప్రేమకథ తర్వాత అఖిల్.. 'ఏజెంట్'లాంటి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తు్న్న చిత్రమే 'ఏజెంట్'. ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ఫస్ట్ లుక్‌లో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తు్న్నాడు. నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కూడా సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ లేకుండా మళ్లీ అలాంటి పోస్టర్‌నే విడుదల చేయడంతో తన ఫ్యాన్స్ నిరాశపడ్డారు.

అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి చాలాకాలమే అయ్యింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ కూడా పూర్తయ్యాయి. దీంతో ఈరోజు అఖిల్ పుట్టినరోజు కావడంతో మూవీ నుండి టీజర్ వస్తుందేమో అని ఎదురుచూశారు అభిమానులు. కానీ టీజర్ మే లో విడుదల కానుందని నిర్మాత అనిల్ సుంకర స్పష్టం చేశారు. ఏజెంట్ టీమ్ మరోసారి కేవలం స్పెషల్ పోస్టర్‌తోనే అఖిల్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES