Sayyeshaa : రీ-ఎంట్రీ ఇస్తున్న అఖిల్ హీరోయిన్

Sayyeshaa : రీ-ఎంట్రీ ఇస్తున్న అఖిల్ హీరోయిన్
X

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సయేశా సైగల్. ఆ సినిమా పరాజయం కావడంతో తెలుగు ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళ, హిందీలో అవకాశాలు దక్కించుకొని పలు సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత సినిమాలకు స్వస్తీ చెప్పేసి తమిళ స్టార్ ఆర్యను ప్రేమించి పెళ్లిచేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈమధ్యే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఇక ఇప్పుడు మరోసారి తెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. అది కూడా తన భర్త ఆర్యతోనే. అవును ఆర్య హీరోగా త్వరలోనే కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సయేశాను తీసుకున్నారట మేకర్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుంది. మరి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సయేశా ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags

Next Story