Keerthi Suresh : నెట్ ఫ్లిక్స్ నుంచి ఎక్కువ షాక్ ఇచ్చింది ‘అక్క’

ఒకే రోజు అనేక ప్రాజెక్ట్స్ ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇవన్నీ ప్రాంతీయ భాషల నుంచి కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చిత్రలు, సిరీస్ లు అనౌన్స్ చేసింది. రానా నాయుడు 2 ప్రకటన వచ్చింది. సూపర్ సుబ్బు అంటూ సందీప్ కిషన్ ఫస్ట్ టైమ్ చేస్తోన్న వెబ్ సిరీస్ ప్రకటనా వచ్చింది. అలాగే తమిళ్ నుంచి సిద్ధార్థ్, మాధవన్, నయనతార వంటి వారితో టెస్ట్ అనే సిరీస్ కూడా అనౌన్స్ అయింది. వీటితో పాటు మరికొన్ని హిందీ సీరీస్ లు ప్రకటించారు. దాదాపు ఇవన్నీ ఈ యేడాదే వస్తాయి అనేది నెట్ ఫ్లిక్స్ ప్రకటనల సారాంశం. ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ ఒక్క ‘అక్క’ మాత్రం షాకింగ్ గా ఉంది. ఆ అక్క పాత్రలో నటించింది కీర్తి సురేష్ కావడమే అందుకు కారణం కాదు. అంతకు మించి తన గెటప్, అగ్రెషన్, క్యారెక్టరైజేషన్.. ఇవన్నీ షాకింగ్ అనిపించాయి అందరికీ.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ సమర్పణలో నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. కీర్తి సురేష్ ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన గెటప్ లో కనిపిస్తోంది. రాధికా ఆప్టే మరో కీలక పాత్రలో నటించింది. అయితే కీర్తి మాత్రం షో స్టీలర్ లా కనిపిస్తోంది. తన నడకలో రాజసం, కళ్లలో ఇంటెన్సిటీ, క్యారెక్టర్ లో అగ్రెషన్.. చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మొదట ఓటిటిలో అడుగుపెట్టింది కీర్తి సురేష్. అక్కడ తనకు ఇంత వరకూ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. బట్ అక్క సిరీస్ తో తను బ్లాక్ బస్టర్ ను మించిన అప్లాజ్ అందుకోబోతోందని అర్థం అవుతోంది. త్వరలోనే స్ట్రీమ్ అవుతుంది అని ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఆ ప్రకటన ఫైనల్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసింది ఈ చిన్న ఫస్ట్ లుక్ వీడియో. మరి సిరీస్ ఎలా ఉంటుందో కానీ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ సోమవారం నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన అన్ని సిరీస్ ల కంటే అక్క కే ఎక్కువ మార్కులు పడ్డాయనేది నిజం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com