Akkineni Akhil : ఘనంగా జరిగిన అఖిల్ వివాహం

అక్కినేని అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. తను ప్రేమించిన జైనాబ్ తో అతని వివాహం అట్టహాసంగా జరిగింది. ఇవాళ(శుక్రవారం ) ఉదయం 6 గంటల 3 నిమిషాల ముహూర్తంలో వివాహ తంతు ముగిసింది. కొన్నాళ్ల క్రితం నాగ చైతన్యతో పాటే అతనికి ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత జైనాబ్ ను ప్రేమించాడు. ఇద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. జైనాబ్ తండ్రి, నాగార్జున కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అది కూడా ఈ పెళ్లి సెట్ కావడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
ఇక ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ దంపతులతో పాటు మరికొందరు రాజకీయ, వ్యాపార ప్రముఖులు అటెండ్ అయ్యారు. అయితే రిసెప్షన్ మాత్రం నాగార్జున ఆహ్వానించిన అందరి సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఒక ఇంటి వాడైన అఖిల్ దంపతులకు మనమూ శుభాకాంక్షలు చెబుదాం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com