Akkineni Akhil: అఖిల్‌తో సినిమా చేస్తున్న దర్శకుడికి కరోనా పాజిటివ్..? వారం క్రితమే..

Akkineni Akhil: మరోసారి కరోనా విజృంభణ మొదలయ్యింది. కొన్నిరోజుల క్రితం వరకు తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ రోజుకు వేలల్లో రావడం మొదలయ్యింది. కేసులు పెరుగుతున్నా కూడా కొంతమంది భయపడకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయిపోయారు. కానీ సినిమా షూటింగ్లు మాత్రం యాధావిథిగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫారిన్‌కు షూటింగ్‌కు వెళ్లిన ఓ దర్శకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
'మెస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' సినిమా హిట్‌తో ఫార్మ్‌లోకి వచ్చాడు అక్కినేని అఖిల్. ఈ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో అఖిల్ మరింత జోష్ పెంచాడు. లవ్ స్టోరీతో హిట్ కొట్టిన అఖిల్.. యాక్షన్ సినిమాతో ఇదే ట్రాక్‌ను కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకే సురేందర్ రెడ్డితో తాను చేస్తున్న 'ఏజెంట్' సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు.
ఇప్పటికే ఏజెంట్ సినిమా కోసం తన పూర్తి లుక్‌ను మార్చేశాడు అఖిల్. ఇంతకు ముందు లాగా కాకుండా ఫిట్‌గా, రఫ్ లుక్‌లో ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే ఏజెంట్ సినిమా పోస్టర్లు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఏజెంట్ సినిమా త్వరత్వరగా షూటింగ్‌ను ముగించి వచ్చే సమ్మర్ బాక్సాఫీస్ బరిలో నిలబడే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఏజెంట్ షూటింగ్ కోసం టీమ్ అంతా యూరప్‌కు వెళ్లారు.
గత వారం ఏజెంట్ టీమ్ అంతా యూరప్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. అక్కడ కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు పాటించి షూటింగ్ ముగించినా కూడా ఏజెంట్ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు మాత్రమే కాదు తన ఫ్యామిలీ అందరికీ కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఏజెంట్ టీమ్ అంతా క్వారంటీన్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com