Akkineni Akhil : సొంత బ్యానర్ నుంచే అఖిల్

హీరోగా స్టార్డమ్ తెచ్చుకునేందుకు కెరీర్ ఆరంభం నుంచి నానా తంటాలు పడుతున్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. చివరగా వచ్చిన ఏజెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అదీ పోయింది. దీంతో చాలాకాలంగా కామ్ గానే ఉంటున్నాడు. ఆ మధ్య యూవీ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఓ మూవీ చేయబోతున్నాడు అనే టాక్స్ వినిపించాయి. బట్ వాటి గురించి మళ్లీ అప్డేట్స్ ఏం లేవు. మరి ప్రీ ప్రొడక్షన్ లో ఉందా లేక హోల్డ్ లో ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనికంటే ముందు మరో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. అదీ సొంత బ్యానర్ లోనే.
గతంలో కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే మూవీతో ఆకట్టుకున్న దర్శకుడు మురళీ కిశోర్ డైరెక్షన్ లో ఈ చిత్రం ఉండబోతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం ఉండబోతోందట. ఈ సారి బయటి బ్యానర్స్ ను నమ్మకుండా తనే రంగంలోకి దిగాడు నాగార్జున. తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ ప్రాజెక్ట్ రూపొందబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ మూవీతో హిట్టు కొట్టిన తరవాతే తను తన ఫ్యాన్స్ ముందుకు వస్తా అని గతంలో చెప్పారు. సో.. ఈ మూవీ తర్వాత అఖిల్ ఫ్యాన్స్ ముందుకు వస్తే మూవీ బ్లాక్ బస్టర్. లేదంటే తెలుసు కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com