Akkineni Akhil : అఖిల్ టైటిల్ గ్లింప్స్ .. గతాన్ని తరమటానికి పోతా

Akkineni Akhil :  అఖిల్ టైటిల్ గ్లింప్స్ .. గతాన్ని తరమటానికి పోతా
X

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్’.ఈ టైటిల్ ను గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ టైటిల్ గ్లింప్స్ ను అఖిల్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ చిత్రంపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అటు ఫ్యాన్స్ కూడా లెనిన్.. అఖిల్ కు ఫస్ట్ బ్రేక్ ఇవ్వబోతోందని నమ్ముతున్నారు. అటు నాగార్జున కూడా ఈ సారి మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పైగా సితార బ్యానర్ ఎంటర్ అయింది కాబట్టి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకుంటున్నారు చాలామంది.

టైటిల్ గ్లింప్స్ చూస్తే.. ‘ గతాన్ని తరమటానికి పోతా .. మా నాయన నాకో మాట సెప్పినాడు.. మనం పుట్టేటప్పుడు ఊపిరింటాదిరా.. పేరుండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడాల్నంటే..’ అనే డైలాగ్ తో ఉన్న ఈ గ్లింప్స్ ఆద్యంతం ఓ పాజిటివ్ వైబ్ తో కనిపిస్తోంది. యుద్ధమే పట్టనీ కృష్ణుడై కదిలెరా అనే బ్యాక్ గ్రౌండ్ తో పాటు వచ్చే విజువల్స్ అన్నీ అదిరిపోయాయి. ఇదో ప్రేమకథ అని రీసెంట్ గా చెప్పారు. యుద్ధానికి మించిన వయొలెన్స్ లో ప్రేమలో ఉంటుంది అని .. అందుకు తగ్గట్టుగానే హీరో తన ప్రేమ కోసం ఓ యుద్ధమే చేస్తాడు అనేలా ఉంది.

ఇక వినరో భాగ్యము విష్ణుకథ అనే చిత్రంతో ఆకట్టుకున్న మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి థమన్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ కాబోతోందని ఈ గ్లింప్స్ తోనే అర్థం అవుతోంది. అఖిల్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ గ్లింప్స్ తో ఈ సారి అఖిల్ టార్గెట్ ను గట్టిగా కొట్టబోతున్నాడు అనేలా ఉందనే చెప్పాలి.

Tags

Next Story