Akkineni Heroes: చిరంజీవి దర్శకుడితో అక్కినేని హీరోల మల్టీస్టారర్.. కానీ ఒకరు మిస్సింగ్..

Akkineni Heroes: మామూలుగా మల్టీ స్టారర్ అంటే ప్రేక్షకుల్లో ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది. ఇద్దరు హీరోల ఒకే సినిమాలో కనిపించడం అంటే అభిమానులకు పండగ. అయితే టాలీవుడ్‌లో ఎక్కువ మల్టీ స్టారర్లు చేసిన హీరోలుగా అక్కినేని హీరోలు రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల ఓ మల్టీ స్టారర్ థియేటర్లలో విడుదలయిన కొన్నిరోజుల్లోనే మరో మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారట అక్కినేని స్టార్లు.
ముందుగా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఒకే సినిమాలో కలిసి నటించిన సందర్భాలు ఆనాటి నుండి తక్కువే. కానీ ఆ అంశాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు అక్కినేని హీరోలు. 'మనం' అనే సినిమాలో మూడు తరాల అక్కినేని కుటుంబం నటించి అప్పట్లో ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఇక ఎప్పుడు సందర్భం వచ్చినా.. ఒకరి సినిమాలో ఒకరు కనిపిస్తూనే ఉంటారు అక్కినేని హీరోలు.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'బంగార్రాజు'. మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్యల పాత్రలకు సమానంగా ప్రాముఖ్యత ఉంది. అయితే వీరి మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతుందన్న వార్త బయటికి రాగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే త్వరలోనే మరో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారంట అక్కినేని హీరోలు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తమిళ దర్శకుడు మోహన్ రాజా. దీని తర్వాత అక్కినేని హీరోలతో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ మల్టీ స్టారర్‌లో కేవలం నాగార్జున, అఖిల్ మాత్రమే ఉండనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. బంగార్రాజుతో పెద్ద కొడుకుతో హిట్ కొట్టిన నాగార్జున.. ఈ మల్టీ స్టారర్‌తో అఖిల్‌తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com