chaysam : అభిమానులకు 'చైసామ్' గుడ్ న్యూస్..!
chaysam : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

chaysam : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తల పైన అటు సామ్, ఇటు చైతూ కూడా స్పందించకపోవడంతో ఇష్యూ మరింత హాట్ టాపిక్ అయింది. అయితే వీరు దీనిపైన డైరెక్ట్‌గా స్పందించకపోయిన వారు తీసుకుంటున్న స్టెప్స్ చూస్తే మాత్రం వినిపించే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
ఇటీవల లవ్ స్టోరీ ప్రమోషన్‌లో భాగంగా చైతూ మాట్లాడుతూ.. మొదట్లో తనపైన వచ్చిన రూమర్స్‌కి బాధపడేవాడినని, కానీ ఇప్పుడు ఓ వార్త ఇంకో వార్తను క్షణాల్లో రిప్లేస్ చేస్తుందని, నిజం మాత్రం ఎప్పటికి అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అటు ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సామ్‌కి ఓ అభిమాని నుంచి 'సామ్.. మీరు ముంబైకి షిప్ట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా' అనే ప్రశ్న ఎదురైంది. దీనిపైన సమంత స్పందిస్తూ.. "ఇలాంటి రూమార్స్ అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు.. అన్ని రూమర్స్ లాగే ఇదో రూమర్" అంటూ చెప్పుకొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. సామ్ పూర్తిగా ఫ్యామిలీ కోసమే లైఫ్‌ని కేటాయించేందుకు సిద్దం అవుతోందట. అందుకే మరో సినిమాకి ఆమె సైన్ చేయలేదని సమాచారం. కాగా ఇప్పటికే గుణశేఖర్ 'శాకంతులం' ని కంప్లీట్ చేసిన సమంత.. తమిళ్‌లో ఓ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉంది.
RELATED STORIES
Sini Shetty: మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి...
4 July 2022 9:38 AM GMTMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే.....
4 July 2022 9:00 AM GMTMaharashtra: 'సీఎం అవుతానని ఊహించలేదు'.. శాసనసభ సమావేశాల్లో షిండే..
3 July 2022 3:35 PM GMTUdaipur: ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితులపై దాడి.. పోలీసుల సమక్షంలోనే..
3 July 2022 12:30 PM GMTVice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్..
3 July 2022 11:53 AM GMTDivorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMT