Bangarraju Collections : బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు ఊచకోత...!

Bangarraju Collections : బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు ఊచకోత...!
Bangarraju Collections : అద్భుతమైన కలెక్షన్స్ తో బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయిస్తున్నాడు. కేవలం మూడురోజుల్లోనే ఈ మూవీ యాబై కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

Bangarraju Collections : అద్భుతమైన కలెక్షన్స్ తో బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయిస్తున్నాడు. కేవలం మూడురోజుల్లోనే ఈ మూవీ యాబై కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు రూ.24 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా.. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో ఇప్పటికే 7 కోట్లకు చేరువగా వచ్చింది. మరోవైపు ఓవర్సీస్ లో 1.20 కోట్లు, కర్ణాటకలో రూ.95 లక్షలు వసూలు చేసింది ఈ చిత్రం.రూ.39కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగిన బంగార్రాజు ఇప్పటికే రూ.27 కోట్లు వసూలు చేసి శభాష్ అనిపించుకుంది. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా, రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా, అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెస్స్ సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story