Akkineni Nagarjuna: సమంతే ముందుగా విడాకులు అడిగింది : నాగార్జున

Akkineni Nagarjuna: విడాకులు తీసుకుని నాలుగు నెలలైనా నాగచైతన్య, నాగార్జున కనిపిస్తే అడిగే మొదటి ప్రశ్న అదే అవుతోంది నలుగురికీ.. మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరొందిన సామ్, చైతూలు విడిపోవడం ఏంటని ఫ్యాన్స్ ఆవేదన చెందారు. అభిమానులు ఈ జంటను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై నాగార్జున స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మొదట సమంతనే విడాకుల ప్రస్తావన తీసుకువచ్చినట్లు చెప్పారు. నాగ చైతన్య ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడు. కానీ అతడు నా గురించి చాలా ఆందోళన చెందాడు. నేను ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటానో, కుటుంబ ప్రతిష్ట ఏమవుతుందో అని చైతూ చాలా ఆలోచించాడని చెప్పారు.
నేను బాధపడుతున్నానని తెలిసి చైతూ నన్ను చాలా ఓదార్చాడు. నాలుగేళ్ల వారి వివాహబంధంలో ఎలాంటి సమస్య రాలేదు. ఇద్దరూ చాలా బావుండేవారు.. మరి ఎందుకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో నాకు తెలియదు.. ఈ నిర్ణయానికి ముందు 2021 నూతన సంవత్సర వేడుకలను కూడా కలిపి జరుపుకున్నారు. ఆ తర్వాత సమస్యలు తలెత్తినట్లు అనిపిస్తుంది అని నాగార్జున తెలిపాడు.
నాగచైతన్య తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సమంతనే సరి జోడీ అని పేర్కొనడం విశేషం. గత ఏడాది అక్టోబర్‌లో సమంత, నాగచైతన్య ఒకేలా సోషల్ మీడియాలో పోస్టులను పెట్టి తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com