సినిమా

Bangarraju : వాసివాడి తస్సాదియ్యా.. ఓటీటీలో 'బంగార్రాజు' రికార్డులు..!

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీ 'బంగార్రాజు'... 2016లో రిలీజైన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకి ఇది రీమేక్..

Bangarraju : వాసివాడి తస్సాదియ్యా..  ఓటీటీలో బంగార్రాజు రికార్డులు..!
X

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీ 'బంగార్రాజు'... 2016లో రిలీజైన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకి ఇది రీమేక్.. కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియో కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 18 నుంచి ''జీ 5' లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను కూడా వీపరితంగా ఆకట్టుకుంటుంది.


విడుదలైన 7 రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్‌గా దూసుకుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కరోనా టైంలో రిలీజ్ చేస్తే నష్టపోతావ్ అని చాలా మంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారని, అయితే సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ సినిమాని రిలీజ్ చేశామని చెప్పుకొచ్చారు నాగ్.. అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్‌ రావడం, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. బంగార్రాజును ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున కృతజ్ఞతలని తెలిపారు నాగ్.

Next Story

RELATED STORIES