Bangarraju Collections : అదరగొట్టిన బంగార్రాజు.. ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్..!
Bangarraju Collections : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు..

Bangarraju Collections : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూకు జోడీగా కృతిశెట్టి కనిపించింది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అనుబ్ రూబెస్స్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైన బంగార్రాజుకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది.
తొలి రోజున ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40k డాలర్లు వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు కొల్లగోట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండగ సీజన్ కావడం, సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా రిలీజ్ కి ముందు ఈ చిత్రం 39 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
RELATED STORIES
Salaar Movie : సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
15 Aug 2022 3:54 PM GMTBhagyashree : ఆకుపచ్చ చీరలో అరవిరిసిన మందారం.. 53 ఏళ్ల వయసులో...
15 Aug 2022 2:10 PM GMTCelebrites Flag Hoisting : సెలబ్రెటీల జెండా వందనం..
15 Aug 2022 11:27 AM GMTBalakrishna : దాని వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉంది :...
15 Aug 2022 10:45 AM GMTSuriya-Karthi: భవన నిర్మాణానికి అన్నదమ్ముల భారీ విరాళం..
15 Aug 2022 10:24 AM GMTPuri Jagannadh: విజయ్ గురించి పూరీ.. అప్పులున్నాయని తెలిసి రూ.2 కోట్లు...
15 Aug 2022 7:45 AM GMT