సమంత అసలు క్యారెక్టర్ ఇదే.. గతాన్ని గమనిస్తే.. !
ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదగడం అంటే అదంతా మాములు విషయం కాదు..

ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదగడం అంటే అదంతా మాములు విషయం కాదు.. అలా అతితక్కువ టైంలో ఆ స్థాయిని అందుకుంది సమంత.. చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోయిన్‌గా అంచలంచలుగా ఎదిగింది. సమంత లైఫ్ జర్నీని ఒక్కసారి గమనిస్తే.. ఆమె వ్యక్తిగతంగా చాలా ధైర్యవంతురాలు.. ఎవరికీ తలవంచని నైజం ఆమె సొంతం.. నమ్మినిదాని కోసం ఎక్కడికైనా వెళ్ళడం ఆమె వ్యక్తిత్వం.
ఏం మాయ చేశావే సినిమాలో ఆమె ఫ్యామిలీకి ఎలాగైతే సినిమాలంటే ఇష్టం ఉండదో ఆమె రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండేది.. కానీ ఒక్క సినిమా అంటూ తన ఫ్యామిలీని కూర్చోబెట్టి కన్వీన్స్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సామ్.. ఇప్పుడు బిజీ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది. సినిమాల్లోకి రాకముందు సమంత బాగా చదువుకొని విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ పాస్‌పోర్ట్ ఆలస్యం కావడంతో పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేయాలనీ అనుకుంది. అందులో భాగంగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. అలా మోడలింగ్ నుంచి ఆమెకి ఏం మాయ చేశావే ఛాన్స్ వచ్చింది.
ఆ సినిమా సమయంలోనే తన కో స్టార్ చైతూతో ప్రేమలో పడిపోయింది. సినిమా సక్సెస్ కావడంతో ఈ జోడికి మంచి క్రేజ్ ఏర్పడింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయిన సమంత... ఎప్పుడు కూడా స్టార్ ఇమేజ్ అనే చట్రంలో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. కథలు నచ్చితే స్టార్ హీరోలతోనూ, స్టార్ డైరెక్టర్ లతోనే కాకుండా తనకంటే స్టార్ ఇమేజ్ తక్కువగా ఉన్న నటులతో కూడా వర్క్ చేసింది సమంత.. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఇరువైపులా కుటుంబ పెద్దలను ఒప్పించి.. ప్రేమించిన చైతూతో మూడుముళ్ళు వేయించుకుంది. పెళ్లి తర్వాత తన సోషల్ మీడియాలో తన పేరుకు ముందు అక్కినేని అని చేర్చుకొని అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో క్యూట్ అండ్ బెస్ట్ కపుల్స్‌గా ఈ జోడికి మంచి పేరుంది.
అలాంటి ఈ జోడి విడిపోతున్నరంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ముందు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లలో నుంచి అక్కినేని అనే పేరును తీసేయడం ఆ వార్తలకి మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది. ఈ విడాకుల పైన అటు చైతూ కానీ ఇటు సామ్ కానీ రెస్పాండ్ కావడంతో ఇష్యూ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపొయింది. కానీ తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విషయంలో.. చైతూ చేసిన ట్వీట్‌ని సామ్ రీట్వీట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో విడాకులు కేవలం వదంతులేనని అభిమానులు అనుకుంటున్నారు.
ప్రేమకోసం ఇరుకుటుంబాలను ఒప్పించి ప్రేమించినవాడిని పెళ్ళిచేసుకున్న సమంత... అతని నుంచి ఎలా విడిపోతుంది.. వచ్చిన వార్తలు పుకార్లు మాత్రమే అన్నది అభిమానుల మాట.
RELATED STORIES
5G Network Services : మీ ఫోన్‌కు 5జీ నెట్వర్క్ కనెక్ట్ అవుతుందా..?...
19 Aug 2022 2:38 PM GMTApple iPhone 14: యాపిల్ ఐఫోన్ 14.. లాంఛింగ్ డేట్..
19 Aug 2022 10:30 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ...
19 Aug 2022 5:00 AM GMTInstagram: రీల్స్ చేసేవారికి ఇన్స్టాగ్రామ్ గుడ్ న్యూస్.. కొత్త...
18 Aug 2022 10:00 AM GMTMaruti Suzuki Alto K10: సరికొత్తగా మార్కెట్లోకి మారుతి సుజుకి ఆల్టో...
18 Aug 2022 6:15 AM GMTElon Musk: సోషల్ మీడియాతో ఎలన్ మస్క్ ఆటలు.. మరోసారి..
17 Aug 2022 1:00 PM GMT