సినిమా

Allu Arjun Desamuduru: అల్లు అర్జున్ 'దేశముదురు' కాదు.. ముందనుకున్న హీరో ఎవరంటే..

Allu Arjun Desamuduru: హీరో ఏమిటి.. సన్యాసిని ప్రేమించడం ఏమిటి.. జనం చెప్పుచ్చుకుని కొడతారు అని అన్నాడట

Allu Arjun Desamuduru: అల్లు అర్జున్ దేశముదురు కాదు.. ముందనుకున్న హీరో ఎవరంటే..
X

Allu ArjunDesamuduru: దర్శకుడికి ప్లస్, హీరోకి మైనస్ అవుతాయి కొన్ని సినిమాలు.. ఒకరితో అనుకుని కథ రాస్తారు.. మరొకరితో తెరకెక్కిస్తారు.. మొత్తానికి ఆ చిత్రం హిట్టు కొడితే అందరికీ సంతోషం.. పాపం రిజెక్ట్ చేసిన హీరోకి మాత్రం చెప్పలేనంత బాధ.. అప్పుడప్పుడు తల్చుకుని ఆ చిత్రం చేసుంటే బావుండేది అనుకుంటారు.. దేశముదురుని రిజక్ట్ చేసిన అక్కినేని సుమంత్ కూడా అలానే అనుకుని ఉంటారు మరి.ఎందుకంటే ఈ కథ తీసుకుని పూరీ జగన్నాథ్ ముందు అతడికే వినిపించారట. కానీ లైన నచ్చలేదు.. హీరో ఏమిటి సన్యాసిని ప్రేమించడం ఏమిటి.. జనం చెప్పుచ్చుకుని కొడతారు అని అన్నాడట. దాంతో పూరీ ఈసురోమంటూ వెనుదిరిగారు.. పూరీ అదృష్టం బావుందేమో ఆ కథ అల్లు అర్జున్‌కి విపరీతంగా నచ్చేసింది. తన మేనరిజంకి తగ్గట్టే ఉందనుకున్నాడేమో దేశముదురుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు..2007లో వచ్చిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. స్టైల్‌గా ఉంటూ సన్యాసిని లైన్‌లో పెట్టిన హీరోగా అల్లు అర్జున్ యాక్షన్ బన్నీ ఫ్యాన్స్‌కి తెగనచ్చేసింది.. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన హన్సిక అందాలు చిత్రానికి ప్లస్ పాయింట్ అయ్యాయి.జనవరి 12న సంక్రాతి కానుకగా విడుదలైన పూరీ జగన్నాథ్ పక్కా మాస్ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. పూరీ డైలాగులు, హన్సిక అందాలు, అల్లు అర్జున్ యాక్షన్, అన్నిటికీ మించి అలీ కామెడీ.. దేశముదురు అదిరిపోయాడు.. అప్పటికీ అల్లు అర్జున్ కెరీర్‌లో అదే పెద్ద హిట్.ఒకానొక సందర్భంలో సుమంత్ తాను రిజెక్ట్ చేసిన దేశముదురు గురించి మాట్లాడుతూ.. పూరీ లైన్ మాత్రమే చెప్పడంతో నచ్చలేదన్నాను.. అదే కథ మొత్తం చెప్పి ఉంటే ఈ సినిమా నేనే చేసుండేవాడినేమో అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా పూరీ జగన్నాథ్ కథను తక్కువ అంచనా వేసి ఓ బ్లాక్ బస్టర్‌ చిత్రాన్ని వదిలేసుకున్నాడు సుమంత్. అప్పటికే సత్యం, గౌరి, మధుమాసం, గోదావరి వంటి సినిమాలతో సుమంత్ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పూరీ అతడిని సంప్రదించాడు.. కానీ సుమంత్ టైమ్ బాగోక దేశముదురుని వదిలేసుకున్నాడు.

Next Story

RELATED STORIES