Akshara Haasan: 'ఇలాంటి బోల్డ్ సినిమాలు మరిన్ని రావాలి': అక్షర హాసన్
Akshara Haasan (tv5news.in)
Akshara Haasan: కోలీవుడ్‌లో పాపులర్ సీనియర్ యాక్టర్లు ఎవరంటే ముందుగా చాలామందికి గుర్తొచ్చే పేర్లు కమల్ హాసన్, రజినీకాంత్. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో, ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కమల్ హాసన్.. తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అందులో ఒకరైన అక్షర్ హాసన్ ఇంకా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతోంది. అయితే తాజాగా తను హీరోయిన్‌గా నటించిన ఒక బోల్డ్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కమల్ హాసన్ వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శృతి హాసన్, అక్షర హాసన్. అయితే వీరిలో శృతి హాసన్.. తన మల్టీ టాలెంట్‌తో అన్ని భాషలను చుట్టేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. కానీ అక్షర మాత్రం సినిమాల సెలక్షన్ విషయంలో తొందరపడకుండా మెల్లగా ముందుకెళ్తోంది. తాజాగా తను హీరోయిన్‌గా నటించిన 'అచ్చం మదమ్ నానమ్ పాయిర్పు' సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది.
'అచ్చం మదమ్ నానమ్ పాయిర్పు' ఒక బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్న అక్షర. ఇలాంటి బోల్డ్ సినిమాలు మరిన్ని రావాలని.. ఒక మంచి సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతోనే దీనిని తెరకెక్కించామని తెలిపింది. ఇదే స్ఫూర్తితో మరికొందరు దర్శకులు ఇలాంటి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుంది అని అక్షర చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com