Akshaye Khanna : ప్రశాంత్ వర్మ సినీవర్స్ లోకి ఔరంగజేబ్

Akshaye Khanna :  ప్రశాంత్ వర్మ సినీవర్స్ లోకి ఔరంగజేబ్
X

మొదట్నుంచీ వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటోన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ అఁ తో కొత్తగా కనిపించాడు. ఆపై కల్కి, జాంబిరెడ్డి అంటూ డిఫరెంట్ అటెంప్ట్స్ తో కమర్షియల్ విజయాలూ అందుకున్నాడు. హను మాన్ తో ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ను ప్రకటించాడు. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తాడని కూడా అనౌన్స్ చేశారు. బట్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మధ్యలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం వచ్చింది. ఎందుకో అదీ చేజారింది.

హను మాన్ తర్వాత పిసీయూ .. అంటే ప్రశాంత్ సినీ వర్స్ ను క్రియేట్ చేసిన అతను అందులో భాగంగా ఇప్పుడు ‘మహా కాళి’ అనే మూవీతో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి కథను మాత్రమే అందించాడు. అపర్ణ కొల్లూరు డైరెక్షన్ చేయబోతోంది. సూపర్ ఉమెన్ కథగా రూపొందుతోన్న ఈ చిత్రం బెంగాల్ నేపథ్యంలో సాగుతుందని ఆ మధ్య అనౌన్స్ చేసినప్పుడు ప్రకటించారు. ఇక ఈ ప్రాజెక్ట్ లోకి తాజాగా ఛావా చిత్రంలో ఔరంగజేబ్ పాత్రలో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ ఖన్నా ఈ జనరేషన్ కు పెద్దగా తెలియకున్నా రెండు జనరేషన్స్ క్రితం ఆడియన్స్ కు బాగా తెలుసు. ఇక ఇప్పుడు ఔరంగజేబ్ గా మెప్పించాడు కాబట్టి అదీ ఈ తరం వారికి యాడ్ ఆన్ గా ఉంటుంది. సో అక్షయ్ ఖన్నా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ కు మరింత భారీతనం తోడవుతుందని చెప్పొచ్చు.

Tags

Next Story