OMG2 : "రఖ్ విశ్వాస్ " .. OMG 2 టీజర్ రిలీజ్
అక్షయ్ కుమార్ నటించిన 'ఓహ్ మై గాడ్ 2 ' ( OMG2 ) టీజర్ రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఇందులో అక్షయ్ శివుడిగా కనిపించనున్నాడు. "రఖ్ విశ్వాస్ తూహే శివ్ కా దాస్" అంటూ టీజర్ రిలీజ్ అయింది. ఆగస్ట్ 11న సినిమా విడుదలకానుందని చిత్ర యునిట్ తెలిపింది. పంకజ్ త్రిపాఠి వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ లో... "భగవంతుడు ఉన్నాడో లేడోనన్న ప్రమాణం.. మనిషి ఆస్తికుడిగా, నాస్తికుడిగా మారి చెప్పొచ్చు... భగవంతుడు మాత్రం మనిషి నిర్మించిన బంధాలలో కట్టుబడటానికి మాత్రం వెనకాడడు.. అతడు నాస్తికుడైన కంజీ లాల్ మెహెతానో... ఆస్తికుడైన కాంతీ షరన్ ముద్గల్ కావచ్చు. " అని సాగే టీజర్ లో అక్షయ్ కుమార్ ఆహార్యం సినీ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. పొడవాటి జఠతో... చిరునవ్వుతో తన భక్తులను రక్షించడానికి శివుడు కైలాసం నుంచి దిగివచ్చినట్లుగా టీజర్ లో చూయించారు.
"బాధల్లో ఉన్న భక్తులను పరమేశ్వరుడు ఎప్పటికీ తన దగ్గరికి లాక్కుంటాడు.. భక్తులను రక్షించడానికి ఆయన కాలాన్ని శాసిస్తాడు" అనే డైలాగ్ అద్భుతంగా వచ్చింది. ఉజ్జైన్ లోని శివలింగానికి అభిషేకం జరుగుతుండగా శివుడైన అక్షయ్... రైల్వే ఫ్లాట్ ఫాంపై కుళాయి నీళ్ల కింద అభిషేకం జరుపుకుంటున్నట్లు చూపెడతారు. పరమేశ్వరుడైన శివుడికి ఎక్కడ అభిషేకం చేసినా ఆయనకే చేరుతుందనేలా మెసేజ్ కనపడుతుంది.
శివుడిగా నటించిన అక్షయ్.. ఫిట్ ఫిజిక్ తో చెరగని చిరునవ్వుతో కనిపిస్తాడు. శివభక్తుడిగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నాడు. ఓహ్ మై గాడ్ మొదటి భాగంలో నాస్తికుడిగా నటించిన పరేష్ రావల్ చుట్టూ కథ తిరుగుతుండగా, OMG 2లో కాంతి శరణ్ ముద్గల్ అనే శివుడిని నమ్మిన పంకజ్ త్రిపాఠి చుట్టూ కథ అల్లినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో యామీ గౌతమ్ లాయర్‌గా నటిస్తుంది. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన, ఓ మై గాడ్ 2 అసలైన దానికి సీక్వెల్, అందులో అక్షయ్ లార్డ్ కృష్ణ పాత్రను పోషించాడు. ఈ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com