Akshay Kumar to play Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ పాత్రలో అక్షయ్.. ఇంకెవరు దొరకలేదా.. : నెటిజన్స్ ట్రోల్స్

Akshay Kumar to play Shivaji Maharaj: మహరాష్ట్ర పేరు చెబితే ఛత్రపతి శివాజీ గుర్తుకు వస్తారు చరిత్రకారులకు. మరి మహరాష్ట్రలో మంచి నటులు లేరా శివాజీ పాత్రలో నటించేందుకు.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను ఎందుకు తీసుకున్నారు అని పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అక్షయ్ కుమార్ దేశంలోనే టాప్ స్టార్. అతని సినీ కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో అతడు చేసిన పృథ్వీరాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అతడి పాత్రను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
ఇప్పుడు చత్రపతి శివాజీగా మరాఠీ సినిమాలో నటిస్తున్నాడు. శివాజీగా అక్షయ్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో నెటిజన్లు మరోసారి నోటికి పని చెప్పారు. ఫన్నీగా ఉన్నాడంటూ అక్షయ్‌ని ట్రోల్ చేస్తున్నారు.
అక్షయ్‌పై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్షయ్ శివాజీగా సరిపోరని భావిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఒక సన్నివేశంలో బల్బులను ఉపయోగించినందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో బల్బులను ఎవరు కనుగొన్నారని ప్రశ్నిస్తున్నారు.
"ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రకు ప్రభాస్ న్యాయం చేయగలడు" అని మరొకరు రాసారు. శివాజీ మహారాజ్ 1674 నుండి 1680 వరకు పాలించారు. థామస్ ఎడిసన్ 1880లో లైట్ బల్బును కనుగొన్నారు. ఇది శివాజీగా అక్షయ్ కుమార్" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com