ala vaikunthapurramuloo: కరోనా సమయంలో.. అలవైకుంఠపురంలో..

ala vaikunthapurramuloo: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన అలవైకుంఠపురంలో.. బాలీవుడ్ ప్రేక్షకులనూ మెస్మరైజ్ చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ జనవరి 26న థియేటర్‌లొ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇక ఈ చిత్రంలోని బుట్టబొమ్మ పాటకు బామ్మలు సైతం స్టెప్పులు వేశారు. 2020వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
రాములో రాములా, సామజవరగమనా, బుట్టబొమ్మ పాటలు యువతను ఉర్రూతలూగించాయి.. సంగీత ప్రియులను అలరించాయి. హిందీలో డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు రిలీజ్ అయినా.. 'షెహజాదా'గా రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. అల్లు అర్జున్, పూజాహెగ్డే పాత్రలను కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ పోషిస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రను బాలీవుడ్ నటి మనీషా కొయిరాల పోషిస్తు్న్నారు. కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆశపడుతున్నారు 'షెహజాదా' మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com