Ali: నా బంగారు తల్లి నా కల నెరవేర్చింది: అలీ ఆనందం..

Ali: నా బంగారు తల్లి నా కల నెరవేర్చింది: అలీ ఆనందం..
Ali: తన కూతురు ఫాతిమా గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు అలీ.

Ali:'సీతాకోక చిలుక' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ దాదాపు 1100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి కొద్దికాలానికే పాపులర్ అయ్యారు. ఓ వైపు కమెడియన్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగానూ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ నిరూపించుకున్నారు. అలీకి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలీ తండ్రి కూడా మహ్మద్ బాషా పేరిట చారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించి అనేక స్వచ్ఛంద సంస్థలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అలీ మంచి ఫ్యామిలీ మ్యాన్. సమయం దొరికినప్పుడల్లా భార్యాపిల్లలతో గడుపుతుంటారు. అతనికి ముగ్గురు పిల్లలు.. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అమ్మాయిలు ఫాతిమా రమీజున్, జుబేరియా. తాజాగా తన కూతురు ఫాతిమా గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు అలీ.

ఫాతిమా డాక్టర్ అయింది. నా కోరికను నా కూతురు తీర్చింది అని అలీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా ఫ్యామిలీలో మొదటి డాక్టర్ మా అమ్మాయి ఫాతిమా అని అలీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫాతిమా కూడా తండ్రి కళ్లలో ఆనందాన్ని చూసి సంతోషపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story