Ali: అభిమానులతో ఆ మాట అనిపించుకోకూడదని..: అలీ

Ali: అభిమానులతో ఆ మాట అనిపించుకోకూడదని..: అలీ
Ali: హాస్య నటుడిగా, హీరోగా అలీ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.. బుల్లి తెర యాంకర్ గానూ అలీ సక్సెస్ అయ్యారు..

Ali: హాస్య నటుడిగా, హీరోగా అలీ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.. బుల్లి తెర యాంకర్ గానూ అలీ సక్సెస్ అయ్యారు..ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండే అలీ తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F3 లో ఓ బరువైన పాత్ర చేశానని చెప్పారు.

ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో యూనిట్ ప్రమోషన్లు చేస్తోంది.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న F3 ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అలీ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

కుటుంబ కథలు అరుదుగా వస్తున్న తరుణంలో అనిల్ రావిపూడి పూర్తి వినోదాత్మక చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఇండస్ట్రీకి చెందిన హాస్య నటులు అందరూ దాదాపుగా ఉన్నారు..

సినిమా పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో సెట్లో 30కి పైగా క్యారవాన్లు ఉన్నాయంటే అర్థం చేస్కోండి.. ఒకప్పటిలా సందడి వాతావరణం కనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి.. కె. రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యన్నారయణ, దాసరి నారాయణ రావులను గుర్తు చేస్తున్నారు. సెట్లో అంతమంది నటులున్నా ఏ మాత్రం బెరుకులేకుండా చిత్రీకరణ చేస్తుంటాడు. నటీనటులు కూడా ఒకరిని మించి ఒకరు నటించారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం పంచుతారు అని అన్నారు.

ఈ సినిమాలో తనది పాల బేబీ పాత్ర అని .. అతడికి ఆడవాళ్లంటే అమితమైన గౌరవమని అన్నారు. డబ్బుని వడ్డీకి తిప్పుతుంటాడు. పాత్రలో భాగంగా గన్ పట్టుకుంటాడు పాల బేబి. అయితే గన్ ఎందుకు పట్టుకున్నాడనేది మాత్రం తెరపైన చూడాలని చెప్పారు. గన్ మోయలేకపోయి.. షూటింగ్ పూర్తయిన తరువాత కొన్ని రోజుల వరకు చేయి నొప్పి తగ్గలేదన్నారు. అంత బరువైన పాత్ర చేశానని అన్నారు సరదాగా.

ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి కానీ కథ ఏమిటో చెప్పరు.. తీరా సినిమా చూసిన ప్రేక్షకుడు ఆలీ ఇందులో ఎందుకు నటించాడో అని అనుకోవాల్సి వస్తుంది.. అందుకే అలాంటి వాటికి నో చెప్తున్నానని అన్నారు. కథ నచ్చితేనే చేస్తానన్నారు. ఈ మథ్య ఓ నేపాలీ సినిమాకి సైన్ చేశానన్నారు. ఒకప్పుడు ఉత్తరాది వాళ్లని తీసుకొచ్చి నటన, భాష నేర్పించి మరీ డబ్బు ఇచ్చే వాళ్లం.. ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకి మన సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మేం పాన్ ఇండియా స్టార్స్ గా మారాం అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story