Alia Bhat: ఐదేళ్ల క్రితం బాల్కనీలో.. : అలియా భట్

Alia Bhatt: ఐదేళ్ల క్రితం ముంబై బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ బాల్కనీలో మా ప్రేమ మొదలైంది. ఇప్పుడు అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది అని అంటోది రణ్‌బీర్ కపూర్ కపూర్ తో మూడు ముళ్లు వేయించుకున్న ఈ బ్యూటీ. వివాహానంతరం తొలి ఫోటోను అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
స్నేహతులు, కుటుంబసభ్యుల సమక్షంలో మాకెంతో ఇష్టమైన ప్రదేశంలోనే వివాహం చేసుకున్నాం. గత ఐదేళ్లుగా ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి మరెన్నో జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత గురువారం సాయంత్రం ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో అలియా ఈ విషయాలు పేర్కొంది. అలియా భట్ తమ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
మీరందరూ మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు మా జీవితంలో చాలా ముఖ్యమైన ఈ క్షణం మరింత ప్రత్యేకం అని అలియా, రణబీర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com