Alia Bhatt-Samantha : ఆలియా, సమంత కాంబోలో త్రివిక్రమ్ మూవీ

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ జిగ్రా. దర్శకుడు వసన్ బాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్, సమంత ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలియా మాట్లాడుతూ " కేవలం తెరపైనే కాదు తెరముందు కూడా సమంత హీరోనే. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. మమల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన త్రివిక్రమ్ గారికి నా కృతజ్ఞతలు. నన్ను, సమంతను లీడ్ రోల్స్‌లో పెట్టి ఓ సినిమా తీయాలని త్రివిక్రమ్ గారిని కోరుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది ఆలియా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆలియా మాటలను త్రివిక్రమ్ సీరియస్ గా తీసుకుంటాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com