Alia Bhatt: అలియాపై నెటిజన్స్ ఫైర్.. 'బ్రహ్మాస్త్ర'ని ఫ్లాప్‌బస్టర్ చేస్తామంటూ..

Alia Bhatt: బాలీవుడ్‌కి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి.. వరుసగా వస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. హీరో హీరోయిన్లు ఏం మాట్లాడినా వాటిని వివాదాస్పదం చేస్తున్నారు నెటిజన్లు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తp నటీ నటులను వేధింపులకు గురిచేస్తున్నారు. కరీనా కపూర్ తర్వాత ఇప్పుడు అలియా భట్ వ్యాఖ్యాలు కూడా వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.
దీని ఎఫెక్ట్ ఆమె రాబోయే చిత్రం బ్రహ్మాస్త్రపై పడేలా ఉంది. ఇది ఇప్పటికే బాలీవుడ్‌లో కొనసాగుతున్న బహిష్కరణ సంస్కృతికి ఆమె కూడా బాధితురాలు అవుతోంది. తాజాగా ఆమె ఒక వెబ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మీకు నేను నచ్చకపోతే, నన్ను చూడకండి' అని మాట్లాడింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మాస్త్రాన్ని బహిష్కరించండి, బాలీవుడ్‌ను బహిష్కరించండి అని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
మేమంతా ఆమె కోరికను తీరుస్తాం. #Brahmastra 500Cr FLOPBUSTER చేద్దాం. మేము వారికి టిక్కెట్లు కొనుగోలుదారులు మాత్రమే. వారికి కావాల్సింది డబ్బు మాత్రమే.' అని అలియాపై విరుచుకుపడుతున్నారు. మరొకరు ఇలా వ్రాశారు.. ధన్యవాదాలు మేడమ్. మేము మీ సలహాను గౌరవిస్తాము. #బ్రహ్మాస్త్రాన్ని బహిష్కరిద్దాం #బాలీవుడ్‌ను కూడా బహిష్కరిద్దాం' అని కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com