Alia Bhatt Stylestatement: ఆమె ధరించిన గూచీ బ్యాగ్ ధరెంతో తెలుసా.. !?

సెలబ్రెటీలంటేనే సాధారణంగా ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా అందరి దృష్టిలో తాము పడాలని, అందర్నీ ఆకర్షించాలి చూస్తుంటారు. అందుకోసం వెరైటీ దుస్తులు, యాక్సెసరీ వస్తువులు కూడా వాడుతుంటారు. అంతే కాదు వారు ధరించిన వాటి విలువ కూడా భారీగానే ఉంటుంది. నెటిజన్లు సైతం ఆ వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దీంతో అలా వారు వేసుకున్న వస్తువులు, బట్టలు ట్రెండింగ్ లో నిలుస్తుంటాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి చెప్పాలంటే.. ఆమె ఫ్యాషన్ కు మారుపేరుగా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. అంతే కాదు ఆమె ధరించిన ప్రతీదీ ఇట్టే వైరల్ అవుతూ.. ఫ్యాషన్ ప్రియులకు కొత్త వస్తువులను పరిచయం అయ్యేలా ఉంటాయి. ఇటీవల ఆమె ధరించిన క్యాస్ట్యూమ్ కూడా అలాంటిదే. రీసెంట్ గా ఎయిర్ పోర్టులో కనిపించిన ఆమె.. గ్రే-వాష్డ్ లూజ్ డెనిమ్ కో-ఆర్డ్ సెట్‌ను ట్రెండీ స్నీకర్స్, స్టైలిష్ గూచీ బ్యాగ్‌తో అందర్నీ ఆకర్షించింది. ఇది ఫ్యాషన్ ఔత్సాహికులు అవలంబించడానికి ఎంతో ఆకట్టుకునేలా ఉంది.
ఇక అలియా వేసుకున్న ఈ దుస్తుల విషయానికొస్తే.. బూడిద రంగులో వదులుగా ఉన్న డెనిమ్ కో-ఆర్డ్ సెట్‌ను ఆమె ధరించారు. సమకాలీన ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా ఉన్న ఈ డ్రెస్సింగ్ ఆమె ఫ్యాషన్ స్కిల్స్ ను మరోసారి బయటపెట్టింది. దీనికి మ్యాచింగ్ గా ఫ్యాషన్ స్నీకర్లు, స్పోర్ట్ టచ్ ను జత చేయడమనేది ఆమెకు ఫ్యాషన్ పై, స్టైలింగ్ పై ఉన్న అవగాహనను తేటతెల్లం చేస్తుంది. ఇక ఆమె హెయిర్ స్టైల్, కళ్లకు గాగుళ్స్ కూడా అలియా మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి.
మామూలుగా సెలబ్రెటీలు అధిక ధర కలిగిన వస్తువులు, వాచ్ లు, కార్లు ఉపయోగిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అలియా ధరించిన దుస్తులు, వస్తువుల ధరలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలియా భట్ ధరించిన వైట్ గూచీ ఓఫిడియా లెదర్ హ్యాండ్‌బ్యాగ్ ఏకంగా రూ. 2లక్షల 70 వేలట. ఐకానిక్ GG లోగోతో అలంకరించబడి, ప్రీమియం హస్తకళకు ఉదాహరణగా, ఈ యాక్సెసరీ ఒక స్టేట్‌మెంట్ పీస్‌గా కనిపిస్తోంది. గూచీ హ్యాండ్‌బ్యాగ్ ఎంపిక అనేది అలియా ఫ్యాషన్ చతురతను, రోజువారీ వస్త్రధారణతో ఉన్నత స్థాయి ఉపకరణాలను సమన్వయం చేయడంలో ఆమె నైపుణ్యాన్ని నొక్కి చెబుతుంది. అంతేకాకుండా, ఆమె హెయిర్ స్టైల్, పెదాలకు నిగనిగలాడే లిప్‌స్టిక్‌తో.. తక్కువ మేకప్‌తో కనిపిస్తోన్న అలియా.. మొత్తానికి ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తోంది.
ఈ లుక్ లో చూసిన అలియా ఫ్యాన్స్.. ఆమెకు ఫ్యాషన్ పై ఉన్న మక్కువను, అవగాహనను కీర్తించకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఆమె చేతిలో పట్టుకున్న బ్యాగ్ ధర తెలుసుకున్న నెటిజన్లు, ఆమె ఫ్యాన్లు.. అంత చిన్న బ్యాగుకు అంత ధరా అంటూ షాక్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com