Alia Bhatt : ఎన్టీఆర్‌కి హ్యాండ్ ఇచ్చిన అలియా..!

Alia Bhatt : జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ కి ఇది 30వ చిత్రం కావడం విశేషం.. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫిక్స్ అయింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా.. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలలో రణ్‌బీర్‌తో పెళ్లి ఉండడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అలియా స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే పనిలో ఉన్నాడట కొరటాల.
మే మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com