25 Nov 2022 6:11 AM GMT

Home
 / 
సినిమా / Alia Bhatt : మా...

Alia Bhatt : మా అమ్మాయి పేరు మా అత్తగారు పెట్టారు.. చాలా బావుంది: అలియా

Alia Bhatt : బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అలియా భట్, రణబీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం చిన్నారికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Alia Bhatt : మా అమ్మాయి పేరు మా అత్తగారు పెట్టారు.. చాలా బావుంది: అలియా
X

Alia Bhatt: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అలియా భట్, రణబీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం చిన్నారికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమ కుమార్తె పేరును వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది మీరు ఊహించినంత ప్రత్యేకమైనది. తమ చిన్నారిని చేతుల్లో పట్టుకుని ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, అలియా తన కుమార్తె పేరును తన అత్తగారు నీతూ కపూర్ సెలెక్ట్ చేశారని పంచుకున్నారు.ఆమెకు రాహా అని పేరు పెట్టారు. ఈ పేరుకు వివిధ భాషలలో వేర్వేరు అర్థాలు ఉన్నాయని వివరించింది. ఆమె ఇలా రాసింది, "రాహా (ఈ పేరుతెలివైన, అద్భుతమైన దాదీచే ఎంపిక చేయబడింది) రాహా అంటే.. స్వాహిలి భాషలో దైవిక మార్గం అని అర్థం. సంస్కృతంలో ఆనందం అని, బంగ్లాలో విశ్రాంతి, సౌఖ్యం, ఉపశమనం. అరబిక్‌లో శాంతి అని, ఆనందం, స్వేచ్ఛ అని కూడా అర్థం.పేరుకు తగినట్లుగా, మేము మా చిన్నారిని పట్టుకున్న మొదటి క్షణం నుండి - మేము అన్నింటినీ అనుభవించాము. మా కుటుంబానికి జీవం పోసినందుకు ధన్యవాదాలు రాహా. మా జీవితాలు ఇప్పుడే ప్రారంభమైనట్లు అనిపిస్తుంది." అని రాసుకొచ్చింది అలియా.


అయాన్ ముఖర్జీ 'బ్రహ్మాస్త్ర' చిత్రీకరణ సమయంలో అలియా, రణబీర్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం అలియా అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది.

Next Story