Alia Bhatt: వెడ్డింగ్ హాలిడేస్ పూర్తి.. షూటింగ్ షురూ..

Alia Bhatt: కొత్తగా పెళ్లయిన అలియా భట్ మళ్లీ వర్క్ మోడ్‌లోకి వస్తోంది. రణబీర్ కపూర్‌తో పెళ్లైన తర్వాత మొదటిసారి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్‌కి బయలుదేరినప్పుడు కెమెరా కళ్లు ఆమెని ఫోకస్ చేశాయి.
రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్‌కి బయలుదేరిన మనీష్ మల్హోత్రాతో ఆమె విమానాశ్రయంలో కనిపించింది.
తన పెళ్లి తర్వాత తన మొదటి పబ్లిక్ అప్పియరెన్స్ కోసం, అలియా అందమైన పింక్ సల్వార్ కమీజ్ ధరించి మరింత అందంగా కనిపించింది.
అలియా భట్, రణవీర్ సింగ్‌తో పాటు, ఈ చిత్రంలో షబానా అజ్మీ, జయ బచ్చన్ మరియు ధర్మేంద్ర కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రొమాన్స్ డ్రామాను ధర్మ ప్రొడక్షన్స్. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com