Alia Bhatt : 'హార్ట్ ఆఫ్ స్టోన్' నటులకు తెలుగు నేర్పించిన అలియా భట్

Alia Bhatt : హార్ట్ ఆఫ్ స్టోన్ నటులకు తెలుగు నేర్పించిన అలియా భట్
రణబీర్ కపూర్‌తో పచ్చబొట్టు వేయించుకునే ప్లాన్ లో ఉన్న అలియా

బాలీవుడ్ నటి అలియా భట్‌కు ఇటీవలి కాలంలో వరుస విజయాలు వెన్నంటే ఉంటున్నాయి. ఆమె ఇటీవలే కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఆమె హాలీవుడ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. గాల్ గాడోట్, జామీ డోర్నన్ కలిసి నటించిన ఆమె మొదటి అమెరికన్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' ఈ శుక్రవారం అంటే ఆగస్టు 11న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు మార్కెటింగ్ యూనిట్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో, అలియా తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది. తెలుగు భాషలో ఎలా మాట్లాడాలో నేర్పింది. రణబీర్ కపూర్‌తో టాటూలు వేయించుకునే ప్లాన్‌ను కూడా ఆమె వెల్లడించింది.

వైర్డ్‌కి అలియా భట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన తోటి నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి గూగుల్ చేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలియా భట్ తెలుగు మాట్లాడుతుందా అని అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ప్రతిస్పందనగా, ఆమె.. గాల్, జామీలకు సరైన వివరణ ఇచ్చింది. తాను తెలుగు భారతీయ భాషకు చెందినదని, ఆస్కార్-విన్నింగ్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్( RRR)ని తెలుగులో కూడా చిత్రీకరించిందని వివరించింది. తాను తెలుగు భాష అనర్గళంగా మాట్లాడలేనని, అయితే రెండు వాక్యాలు మాత్రం తెలుసునని చెప్పింది. గల్ ఆమెకు తెలుగులో వ్యక్తీకరణను నేర్పించమని కోరిగా.. అందుకు అలియా సర్ఫ్రైజింగ్ రిప్లై ఇచ్చింది. “అందరికి నమస్కారం (అందరికీ హలో)” అని మళ్లీ చెప్పమని అలియా గాల్‌ని కోరింది.

ఆ తర్వాత సంభాషణలో.. అలియాను అకాడమీ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటలో ఉన్నారా అని కూడా అడిగారు. "దురదృష్టవశాత్తూ లేదు, కానీ నేను నాటు నాటు స్టెప్ వేయగలను" అని ఆమె సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఆమె ఆ పాపులర్ హుక్ స్టెప్‌ను కూడా ప్రదర్శించింది. అంతే కాదు దాన్ని ఆమె.. గాల్, జామీలకు కూడా నేర్పింది.

రణబీర్ కపూర్‌తో కలిసి టాటూ..

అలియాపై టాటూ ఉందా అని కూడా ఈ ఇంటర్యూలో ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆమె తాను, తన భర్త రణబీర్ కపూర్ ఒక టాటూ వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని జవాబు ఇచ్చింది. "లేదు ఇంకా కాలేదు. నా భర్త, నేను ఏదైనా వేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం ” అని ఆమె చెప్పింది. ఆమె చాలా సున్నితమైనదని, ప్రేమకు సంబంధించిన కొన్ని పూర్తిగా విచిత్రమైన సిద్ధాంతాలను కలిగి ఉందని కూడా చెప్పింది. "ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత సంతోషకరమైన వ్యక్తిని నేనే" అంటూ అలియా వ్యాఖ్యానించింది.

స్పై థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ స్టోన్‌'లో , అలియా కీయా ధావన్ అనే హ్యాకర్ పాత్రను పోషిస్తుంది. ఆమె ఈ సినిమాలో ఓ అమూల్యమైన ఆయుధాన్ని దొంగిలిస్తుంది. దాని కోసం ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.


Tags

Read MoreRead Less
Next Story