Alia Bhatt: సమంతతో గొడవకు సిద్ధమంటున్న ఆలియా భట్..

Alia Bhatt: ఆలియా భట్.. ఇప్పటివరకు ఈ భామ కేవలం బాలీవుడ్‌లోనే ఫేమస్. కానీ ఇప్పుడు అలా కాదు.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఆలియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాను తెలుగులో చేసిన మొదటి చిత్రం 'ఆర్ఆర్ఆర్' ఇంకా విడుదల కాకముందే తెలుగు దర్శక నిర్మాతలంతా తనకు ఛాన్సులు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు. తాజాగా ఆలియా.. సమంతపై చేసిన కామెంట్స్ సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించిన చిత్రమే 'గంగూబాయి కతియావాడి'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ఇప్పటికే విడుదలయిన గంగూబాయి కతియావాడి టీజర్, ట్రైలర్‌లో ఆలియా పర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. విడుదలకు ఇంకా పదిరోజులే ఉండడంతో ఆలియా ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది.
గంగూబాయి కతియావాడి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తనకు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయాలని ఉందన్న విషయాన్ని బయటపెట్టిన ఆలియా.. తాజాగా సమంతపై కూడా ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. అప్పటివరకు సౌత్ సినిమాలకే పరిమితమయిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బీ టౌన్ ప్రేక్షకులను కూడా పలకరించింది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో సమంత డీ గ్లామర్ రోల్‌లో కనిపించడమే కాకుండా విలన్‌గా అందరినీ మెప్పించింది. అయితే ఆ సిరీస్ చూసిన తర్వాత ఆలియా.. సమంతకు పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. తనకు కూడా అలాంటి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టమని, సమంతో కలిసి అలాంటి ఓ యాక్షన్ సినిమాలో తలబడడం తన డ్రీమ్ అని చెప్పింది ఆలియా. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రేక్షకులు ఒక యాక్షన్ డ్రామాను ఎప్పుడు చూస్తారో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com