Ram Charan : ఇక అందరి చూపూ గేమ్ ఛేంజర్ వైపు

Ram Charan :  ఇక అందరి చూపూ గేమ్ ఛేంజర్ వైపు
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మొన్నటి వరకూ డిమ్ లైట్ లో ఉంది. ఇకపై రెగ్యులర్ గా లైమ్ లైట్ లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ డేట్స్ రెడీ అయ్యాయి. ఈ శనివారం నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. శనివారం ఈ మూవీ టీజర్ ను అక్కడి నుంచే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ లక్నోకు వెళుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న రామ్ చరణ్ మూవీ కాబట్టి భారీ అంచనాలున్నాయి. వాటిని ఈ టీజర్ డబుల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది మూవీ టీమ్.

నిజానికి భారతీయుడు 2 చూసిన తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ఈ గేమ్ ఛేంజర్ పై ఇప్పటి వరకూ ఫ్యాన్స్ లో పెద్ద నమ్మకాలు లేవు. కానీ టీజర్ తో గేమ్ మొత్తం మారిపోతుందనే టాక్స్ బాగా వినిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ తో ఈ టీజర్ కనిపించబోతోందంటున్నారు. మామూలుగా స్టార్ హీరోస్ టీజర్ అంటే నిమిషంలోపే ముగిస్తారు. బట్ ఈ మూవీకి దాదాపు రెండు నిమిషాల టీజర్ ఉంటుందట. అదే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేయబోతోందంటున్నారు. ఇక టీజర్ తర్వాత వరుసగా మరికొన్ని పాటలతో పాటు క్రిస్మస్ వరకు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారు. ఆ మేరకు ప్రమోషన్స్ తో దూసుకుపోయేలా ప్లాన్ చేసింది గేమ్ ఛేంజర్ మూవీ టీమ్.

వినయ విధేయ రామ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడీ కట్టింది కియారా అద్వానీ. తనతో పాటు అంజలి, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునిల్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందించాడు. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. మరి నేపథ్య సంగీతం ఎలా ఉంటుందో కానీ.. శంకర్ ఈ సారి గ్యారెంటీగా మ్యాజిక్ చేస్తాడనే అంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు మెగా ఫ్యాన్స్ చూపు మొత్తం గేమ్ ఛేంజర్ టీజర్ పైనే ఉందిప్పుడు.

Tags

Next Story